ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీనియర్స్, జూనియర్స్ మధ్య వివాదం చెలరేగింది. కాలేజీ ఫెస్టు సంబంధించి పనుల్లో భాగంగా సోమవారం 3rd ఇయర్ విద్యార్థులకు జూనియర్లకు మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సీనియర్స్ మాపై ర్యాగింగ్ చేస్తున్నారని, రాత్రి సమయంలో బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని జూనియర్స్ ఆరోపించారు.