TG: పదో తరగతి పరీక్షలు 2026 మార్చి 16న నిర్వహించేందుకు SSC బోర్డు సిద్ధమైంది. మార్చి 13తో ఇంటర్ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. మరోవైపు విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఒక్కో పేపర్‌కు మధ్య 1-2 రోజులు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేశారు. MAR 16న పరీక్షలు ప్రారంభమైతే ఏప్రిల్ మొదటి వారంలో ముగియనున్నాయి. రేపు లేదా ఎల్లుండి షెడ్యూల్ రానుంది.