కృష్ణా: ఉంగుటూరు పోస్టాఫీసులో రూ.2 కోట్లకు పైగా ఖాతాదారుల డిపాజిట్లు మాయమైన ఘటన బయటపడింది. పోస్టు మాస్టర్ దేవేంద్రరావు, పోస్టుమాన్ శేఖర్ కలిసి ఏడాదిగా FDలు, సేవింగ్స్ రికార్డుల్లో భారీ మోసానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. సోమవారం ఓ మహిళ FD తీసుకోడానికి రాగా అసలు విషయం తెలిసింది. ఖాతాదారులు విచారణ కోరగా, అధికారలు పోస్ట్మాస్టర్ను సస్పెండ్ చేశారు.