SKLM: ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని ఆర్డీఓ సాయి ప్రత్యూష తెలిపారు. సోమవారం సాయంత్రం జలుమూరు మండలంలోని పలు గ్రామాలలో తహసిల్దార్ జె. రామారావుతో కలిసి పర్యటించిన ఆమె, వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.