పెద్దపల్లి పట్టణంలో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, పాత ట్యాంకర్ కూల్చివేత, నూతన ట్యాంకర్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పాత ట్యాంకు కూల్చివేత గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు.