ATP: యువత, విద్యార్థులను గంజాయి బారిన పడకుండా కాపాడేందుకు అనంతపురం వన్ టౌన్ పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. నవోదయ కాలనీలో గంజాయి విక్రయిస్తున్న షికారి శీనా, షేక్ మహమ్మద్ ఖాన్ అనే ఇద్దరిని సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీరు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలింది.