ప్రకాశం: బేస్తవారిపేట మండలం పిట్టికాయగుళ్ల గ్రామంలో సోమవారం ఓ వర్గం పోలేరమ్మ గ్రామోత్సవం నిర్వహిస్తుండగా మరో వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి, ఇరు వర్గాల వారితో మాట్లాడి శాంతింపజేశారు. మార్కాపురం సబ్ కలెక్టర్, తహసీల్దార్, డీఎస్పీ నాగరాజు, సీఐ మల్లికార్జున ఇరు వర్గాల వారితో చర్చించి,శాంతియుతంగా మెలగాలని అన్నారు.