HYD: నగరంలో తొలిసారిగా అధునాతన IFAS (ఇంటిగ్రేటెడ్ ఫిక్స్డ్ – ఫిల్మ్ యాక్టివేటెడ్ స్లడ్జ్) టెక్నాలజీతో కూడిన మురుగు నీటి శుద్ధి కర్మాగారం (STP) రానుంది. HMDA ఆధ్వర్యంలో తొర్రూర్ లే అవుట్లో రూ. 5.90 కోట్ల అంచనా వ్యయంతో పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. 2.3 MLD సామర్థ్యం గల ఈ ప్లాంట్ కేవలం 0.43 ఎకరాల పరిమిత స్థలంలోనే నైట్రోజన్, ఫాస్ఫరస్లను సమర్థవంతంగా తొలగించనుంది.