SRD: సిర్గాపూర్ మండలంలోని లక్ష్మణ్ నాయక్ తండ గ్రామపంచాయతీ ని ఏకగ్రీవం చేసేందుకు గ్రామ ప్రజలు సోమవారం నిర్ధారించారు. ST మహిళ రిజర్వేషన్ కేటాయించగా, 4 వార్డు సభ్యులతో పాటు, మహిళా సర్పంచ్ అభ్యర్థిని ఖరారు చేసుకున్నట్లు స్థానిక తాజా మాజీ సర్పంచ్, గ్రామస్తులు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా, గ్రామస్తులంతా ఐక్యమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.