TG: కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఉదయం 8:10 గంటలకు శంషాబాద్లో ల్యాండ్ అవ్వాల్సిన ఈ ఫ్లైట్కు.. బాంబు ఉందని మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని వెంటనే ముంబైకి మళ్లించారు. ప్రస్తుతం ఫ్లైట్ ఇంకా ల్యాండ్ కాకపోవడంతో.. అందులోని ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోతున్నారు.