దేశ రాజధాని ఢిల్లీ చలి గుప్పిట్లో చిక్కుకుంది. ఉష్ణోగ్రతలు కనిష్టంగా 5 డిగ్రీలకు పడిపోవడంతో జనం గజగజా వణికిపోతున్నారు. గరిష్టంగా 24 డిగ్రీలే ఉంటోంది. మరోవైపు రాబోయే 5 రోజులు కూడా తీవ్రమైన చలిగాలులు (Cold Wave) ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. పొగమంచు, చలి దెబ్బకు ఢిల్లీ వాసులు ఇళ్లకే పరిమితమవుతున్నారు.