iBOMMA రవిని పోలీసులు మరో 3 కేసుల్లో అరెస్టు చేశారు. మంచు విష్ణు, దిల్ రాజు, తండేల్ మూవీ పైరసీ పట్ల కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే జైల్లో ఉన్న అతడికి నాంపల్లి కోర్టు మరో 14 రోజులపాటు రిమాండ్ విధించింది. రవికి బెయిల్ మంజూరు చేయవద్దని, విదేశాలకు వెళ్లిపోయి ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరఫు లాయర్ వాధించారు. దీంతో బెయిల్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది.