ATP: పింఛన్ల పంపిణీలో అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో పంపిణీ చేయాల్సిన 2,78,905 మంది లబ్ధిదారుల్లో తొలి రోజు 2,65,418 మందికి (95.16 శాతం) రూ. 118.034 కోట్లు అందజేశారు. అత్యధికంగా తాడిపత్రి అర్బన్‌లో 97.57% పంపిణీ జరిగింది. నిన్న పింఛన్ తీసుకోని వారికి ఇవాళ సచివాలయ సిబ్బంది పంపిణీ చేయనున్నారు.