KDP: త్వరలో 90 వేల మంది HIV బాధితులకు నెలకు రూ.4వేల చొప్పున పెన్షన్లు ఇస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 2030 నాటికి ఏపీని హెచ్ఐవీ రహిత రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. రాష్ట్రంలో హెచ్ఐవీ పాజిటివిటీ రేటు 0.10 శాతం నుంచి 0.04 శాతానికి తగ్గిందని, అయితే కొత్త కేసుల్లో ఐటీ ఉద్యోగుల ఉనికి ఆందోళన కలిగిస్తోందని అన్నారు.