NRPT: ప్రజా ప్రభుత్వంలోని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోనే అత్యుత్తమ రహదారులను నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లోని మండలాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తామని తెలిపారు. గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో రాష్ట్రంలోని రహదారులను మెరుగుపరచలేదని ఆయన విమర్శించారు.