SKLM: ఎచ్చెర్ల మండలం మూసవానిపేట తీరానికి చేరుకున్న బంగ్లాదేశ్‌కు చెందిన 13 మంది మత్స్యకారులను మెరైన్ సీఐ బోర ప్రసాదరావు ప్రశ్నించారు. చేపల వేటకు బయలుదేరి ప్రతికూల పరిస్థితుల్లో పడవ మరమ్మతులకు గురై ఇక్కడి తీరానికి చేరుకున్నామని వారు వివరించారు. సోమవారం రాత్రి నరసన్నపేటలోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా.. ఈ నెల 15 వరకు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.