SDPT: జిల్లాలోనే 38 గ్రామపంచాయతీలతో అతిపెద్ద మండలంగా అక్కన్నపేట ఉంది. కాగా అందులో 15 గిరిజన జీపీలు ఉన్నాయి. అయితే ఈ పంచాయతీ స్థానిక ఎన్నికల మూడో విడత పోలీంగ్‌కు ఎంపికైంది. పంచాయతీ ఎన్నికల పోరు మొదలు కావడంతో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ నుంచే ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు బరిలోకి దిగుతూ.. పార్టీ నాయకత్వానికి రెబల్స్‌గా సవాల్ విసురుతున్నారు.