KNR: లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపై DMHO డా. వెంకటరమణ అధ్యక్షతన అడ్వైజరీ కమిటీ సమీక్ష సమావేశం కరీంనగర్ DMHO కార్యాలయంలో నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 07 స్కానింగ్ సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నేరమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లింగ నిర్ధారణ చేస్తే 9849902501 సంప్రదించాలి.