VSP: పలు రైళ్లలో ఈస్ట్ కోస్ట్ రైల్వే తాత్కాలికంగా అదనపు బోగీలు జత చేసింది. ప్రయాణికుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని స్లీపర్, AC–3 కోచ్లలో డిసెంబర్ 1 నుంచి జనవరి 2 వరకు అందుబాటులో ఉంటాయని వాల్తేరు రైల్వే కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సంబల్పూర్, ఎరోడ్, భువనేశ్వర్, బెంగళూరు, తిరుపతి మార్గాల్లోని రైళ్లలో ఈ ప్రత్యేక సౌకర్యం అందుబాటులో ఉండనునంది.