NGKL: జూబ్లీహిల్స్ ఎన్నికలో కొల్లాపూర్ నాయకులు క్రమశిక్షణతో సమష్టిగా కృషి చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించారని శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ‘రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ విజయాన్ని శాశ్వతం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కాంగ్రెస్ పార్టీ కుటుంబం లాంటిది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం’ అని తెలిపారు.