NGKL: జంతు సంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేసి, వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో SPCA సభ్యులు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జంతువులపై హింస జరగకుండా ప్రభుత్వం రూపొందించిన చట్టాలను కఠినంగా అమలు చేయాలని సూచించారు.