KDP: ఖాజీపేట మండల గ్రంధాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బాలల దినోత్సవం, జవాహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా అధికారి హరికృష్ణ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటారని పిల్లలు, గులాబీలు ఆయనకు అమితమైన ప్రేమ అని అన్నారు.