AP: గతంలో HYDలో IT రంగాన్ని అభివృద్ధి చేశామని CM చంద్రబాబు తెలిపారు. అమరావతిని మరో సింగపూర్‌లా నిర్మిస్తామని చెప్పారు. బీహార్ ఎన్నికల్లో NDA ఘన విజయం సాధించిందని.. అభివృద్ధికి ప్రజలు పెద్దపీట వేస్తారనని మరోసారి రుజువైందన్నారు. మోదీపై ప్రజలకు పూర్తిస్థాయి నమ్మకం ఉందని వెల్లడించారు. మోదీ నాయకత్వంలోనే దేశ సమగ్రాభివృద్ధి, సుస్థిరపాలన సాధ్యమని వ్యాఖ్యానించారు.