బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ, ‘ఇండి’ కూటమి భవిష్యత్తు కోసం కొత్త వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పరాజయాల నుంచి గుణపాఠం నేర్చుకుని, పార్టీని బలోపేతం చేసేందుకు తక్షణమే సమగ్ర మార్పులు చేయాలని డీకే సూచించారు.