ATP: గుత్తి పెన్షనర్స్ భవనంలో ఇవాళ భారతదేశ తొలి ప్రధాని జవహర లాల్ నెహ్రూ 136వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పెన్షనర్స్ అసోసియేషన్ కోశాధికారి జన్నే కుల్లయ్య బాబు మాట్లాడుతూ.. చాచా నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టమన్నారు. అందుకే, ఆయన పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం నిర్వహిస్తారని పేర్కొన్నారు.