TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 20 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలోనే నవీన్ గెలుపు ఖాయమైందన్నారు. రెండుసార్లు ఓడినా, ప్రజల్లో ఉంటూ మంచిపేరు తెచ్చుకున్నాడని అన్నారు. గెలుపు తర్వాత నవీన్ ప్రజల మనిషిలాగే ఉండాలన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలకు.. MIM శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.