బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు చోరీ ప్రచార అస్త్రంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ముందుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. అయినా రాహుల్ ప్రచారాన్ని అక్కడి ప్రజలు పట్టించుకోలేదని ఓటింగ్ సరళిని చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం NDA కూటమి 190+ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతేకాకుండా కౌంటింగ్ నేపథ్యంలో రాహుల్ కనిపించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.