NLR: పుస్తక పఠనం, బాల సాహిత్యమే లక్ష్యంగా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించినట్లు ప్రధానోపాధ్యాయురాలు పి. వేదవతి అన్నారు. బుచ్చి పట్టణం రామచంద్రాపురం పిఎం. శ్రీ పాఠశాల జాషువా సాహితీ చైతన్య నిలయంలో గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించి తొలి ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. నెహ్రూ గురించి విద్యార్థులకు వివరించారు.