KNR: బీసీ జేఏసీ పిలుపు మేరకు చిగురుమామిడి మండల కేంద్రంలో బీసీల ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్ మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానాన్ని గౌరవించి, కేంద్రం రిజర్వేషన్ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి అమలు చేయాలని దీక్ష కార్యక్రమం నిర్వహించారు.