అన్నమయ్య: ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను గురువారం తంబళ్లపల్లి జై భారత్ జాతీయ పార్టీ తంబళ్లపల్లి ఇంఛార్జ్ అంజలి మదనపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మంత్రికి పుష్పగుచ్చం అందజేసి శాలువతో సన్మానించారు. అనంతరం ఆమె తంబళ్లపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అన్నివిధాల కృషి చేయాలని మంత్రిని కోరారు.