ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా విడుదలపై సాలిడ్ న్యూస్ బయటకొచ్చింది. 2026 మే నాటికి షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది దసరా కానుకగా దీన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.