NLG: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో పీజీ రెండవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం సాయంత్రం ఎంజీయూ వైస్ ఛాన్స్లర్ అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. సెప్టెంబర్లో నిర్వహించిన పరీక్షలకు 1,160 మంది విద్యార్థులు హాజరు కాగా 794 మంది ఉత్తీర్ణత సాధించినట్లు సీవోఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు.