NLG: చిట్యాల పీఏసీఎస్ పరిధిలో ఈ ఏడాది 200 ఎకరాల్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లక్ష్యంగా పెట్టుకున్నామని పీఏసీఎస్ ఛైర్మన్ సుంకరి మల్లేశ్ గౌడ్ తెలిపారు. వట్టిమర్తిలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ వినోద, హార్టీకల్చర్ అధికారి శ్వేత, ఏఆర్ జ్యోతిర్మయి, సీఈవో, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.