NZB: మోపాల్ మండలం ముదక్పల్లిలో ఉపాధి హామీ ప్లానింగ్ ప్రాసెస్ గ్రామసభ ఇవాళ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి 2026 – 27 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టబోయే పనులు గురించి గ్రామ ప్రజలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సూర్య, టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, గ్రామస్థులు పాల్గొన్నారు.