ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు పెద్దదిక్కుగా ఉన్న MGM ఆసుపత్రిలో భారీ కుంభకోణం జరిగింది. అయితే ఇటీవల HIT TV, పలు మీడియాలో వచ్చిన కథనాలకు.. విజిలెన్స్ అధికారులు స్పందించారు. గురువారం డీఎస్పీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో MGM ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు. 2021-2024 మధ్య 30 కోట్ల వరకు కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.