TG: ఢిల్లీ పేలుడు ఘటన దేశ విద్రోహ శక్తుల కుతంత్రమేనని రాష్ట్ర BJP చీఫ్ రామ్‌చందర్ వ్యాఖ్యానించారు. దేశంలో శాంతికి భంగం కలిగించి, ప్రగతిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో చేసిన చర్య అని మండిపడ్డారు. కేంద్రం ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా నిర్ధారించిందని తెలిపారు. దేశ దర్యాప్తు సంస్థల అత్యుత్తమ దర్యాప్తుల్లో ఇదీ ఒకటని, ఈ సమయంలో కేంద్రానికి అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.