కోనసీమ: రావులపాలెం మండలం దేవరపల్లిలో మంగళవారం పట్టా రాంబాబుకు చెందిన పెంకుటిల్లు అగ్నిప్రమాదానికి గురైంది. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇవాళ వారిని పరామర్శించి బియ్యం బస్తాతో పాటు ఆర్థిక సాయం అందజేశారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక టీడీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.