KMM: కూసుమంచి మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారని చెప్పారు. లబ్ధిదారులు సకాలంలో హాజరు కావాలన్నారు.