VZM: కూటమి ప్రభుత్వంతోనే సొంత ఇంటి కల నెరవేరుతుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఇవాళ బొండపల్లి మండలంలోని అంబటివలస గ్రామంలో నూతనంగా నిర్మించిన గృహాలను మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు దశలవారీగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామ సుందర్ రెడ్డి పాల్గొన్నారు.