W.G: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకులు బుధవారం ఉండిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉండి సెంటర్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు మురళి కృష్ణంరాజు డిమాండ్ చేశారు.