ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలకు అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం కేంద్రంగా ఉన్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఒకప్పుడు జామియా, అలీగఢ్ విశ్వవిద్యాలయాలకు ప్రత్యామ్నాయంగా ఎదిగిన అల్ ఫలాహ్ వర్సిటీ.. నాక్ నుంచి ‘A’ గ్రేడ్ అందుకుంది. అయితే, నేడు ఫరీదాబాద్, ఎర్రకోట పేలుళ్ల కుట్రకు కేంద్రంగా మారింది. పేలుడు ఘటన కేసులో పలువురు డాక్టర్లు, సిబ్బందిని దర్యాప్తు బృందాలు ప్రశ్నిస్తున్నాయి.