నాగార్జున, దర్శకుడు RGVల ‘శివ’ మూవీ ఈనెల 14న రీ-రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీలో మురళీమోహన్ కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్‌పై RGV పోస్ట్ పెట్టాడు. ‘అప్పటి బాల నటి ఇప్పుడు పెద్దదైంది’ అంటూ ఆమె ఫొటోను షేర్ చేశాడు. ‘శివలోని ఐకానిక్ సైకిల్ ఛేజింగ్ సన్నివేశంలో భయంతో కనిపించిన చిన్నారి సుష్మ ఇప్పుడు USలో AI&Cognitive Scienceలో రీసెర్చ్ చేస్తోంది’ అని తెలిపాడు.