ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనికి చేశారు. ఈ మేరకు రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందితో కలిసి అన్ని వార్డులను తిరుగుతూ పరిశీలించారు. ఔట్ డేటెడ్ మందులను గుర్తించి రోగులకు ఇవ్వకుండా, జాగ్రత్తలు పాటించాలని వైద్యులకు సూచించారు .