SKLM: పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫీజును ఈనెల 13 నుంచి 25 వరకు చెల్లించ వచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు తెలిపారు. జిల్లాలోని 450 ప్రభుత్వ, 196 ప్రైవేట్ పాఠశాలల్లో 22,890 మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారని తెలిపారు. HMలు విద్యార్థులకు సమాచారం అందించాలని అన్నారు. గడువు దాటితే అపరాధ రుసుంతో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.