కృష్ణా: అనంతపురంలో ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగిన 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడా పోటీల్లో కృష్ణా జిల్లా బృందం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండవ స్థానాన్ని దక్కించుకుంది. రెవెన్యూ సిబ్బంది వివిధ విభాగాల్లో పతకాలను కైవసం చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది కృషి, నిబద్ధత ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ వారిని నిన్న అభినందించారు.