NZB : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ నుంచి స్వల్ప ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం 9,454 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు అంతే మొత్తంలో ఔట్ ఫ్లో మెయింటెన్ చేస్తున్నారు. ఇన్ ఫ్లో తగ్గడంతో వరద గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 650, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.