ఢిల్లీలో సోమవారం జరిగిన భారీ పేలుడు ఘటనలో 12 మంది మృతిచెందారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా విచారణ చేపట్టాయి. రిపబ్లిక్‌డే రోజున దుండగులు పేలుళ్లకు కుట్ర చేసినట్లు అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలోనే పేలుడుకు వారం రోజుల ముందు ఉమర్‌తో కలిసి తాను ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించినట్లు ముజమ్మిల్ అంగీకరించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.