మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం ప్రిమిసెస్లో ఉన్న ఇండోర్ స్టేడియంలో ఇవాళ జిల్లా యువజన ఉత్సవం నిర్వహించడం జరుగుతుందని డీవైఎస్వో శ్రీనివాస్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఉదయం 9 గంటలకు జిల్లా స్థాయి పోటీలు ప్రారంభం అవుతాయని అన్నారు. జానపద బృంద నృత్యాలు, జానపద బృంద గీతాలు, కథా రచన, చిత్రలేఖనం, కవితా రచనలు, ఆరోగ్యంపై ప్రదర్శనలు ఉంటాయన్నారు.