WGL: నగరంలోని కోతులను నియంత్రించడానికి నిర్వహించిన టెండర్ ప్రక్రియ పారదర్శకంగా మంగళవారం సాయంత్రం పూర్తయినట్లు అదనపు కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాజీపేట కాశిబుగ్గ సర్కిల్ పరిధిలో శివయ్య అనే వ్యక్తి ఒక కోతిని పట్టుకోడానికి రూ 520 ఇస్తామని ప్రతిపాదించడంతో టెండర్ అతనికి అప్పగించినట్లు వెల్లడించారు.