రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్మిక, విజయ్ ఒకే వేదికపై కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ జరగనున్న రష్మిక నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ మీట్‌కు విజయ్ హాజరుకానున్నట్లు సమాచారం. దీంతో ఈ ఈవెంట్లో తమ పెళ్లి గురించి వారు అధికారికంగా ప్రకటిస్తారేమోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.